
శంకరన్న అరెస్టుకు రంగం సిద్ధం: మహారాష్ట్రలో పూజలు
హైదరాబాద్: గ్రీన్‌ఫీల్డ్ భూముల వ్యవహారంలో మాజీ మంత్రి, కాంగ్రెసు సీనియర్ శానససభ్యుడు పి. శంకరరావు అరెస్టుకు రంగం సిద్ధమవుతోంది. శాసనసభ స్పీకర్ అనుమతి తీసుకుని ఆయనను అరెస్టు చేసేందుకు హైదరాబాదులోని ఆల్వాల్ పోలీసులు ఏర్పాట్లు చేసుకున్నట్లు చెబుతున్నారు. శంకరరావును అదుపులోకి తీసుకుని ప్రశ్నించడానికి పోలీసులు మొదట ప్రయత్నిస్తున్నారు.
శంకరరావు కోసం ఆలస్వాల్ ఎసిపితో పాటు 15 మంది పోలీసులు ఆయన ఇంటికి వెళ్లారని సమాచారం. అయితే, శంకరరావు అందుబాటులో లేరని తెలిసింది. ఆయన మహారాష్ట్రలోని శనిసింగారం ఆలయంలో పూజలు నిర్వహించడానికి వెళ్లినట్లు చెబుతున్నారు. శంకరరావును పోలీసు అధికారులు ఫోన్‌లో సంప్రదించడానికి ప్రయత్నించారు. అయితే, ఆయన సెల్‌ఫోన్లు స్విచాఫ్ చేసి ఉన్నాయి.
గ్రీన్ ఫీల్డ్ భూముల వ్యవహారంలో మాజీ మంత్రి, కాంగ్రెసుసీనియర్ శానససభ్యుడు పి. శంకరరావుకు హైకోర్టు షాక్ ఇచ్చింది. ఈ కేసులో శంకరరావుపై జారీ అయిన అరెస్టు వారంట్‌పై ఉన్న స్టేను హైకోర్టు కొట్టేసింది. శంకరరావుతో పాటు ఆయన సోదరుడు దయానంద్‌ను కూడా పోలీసులు విచారిస్తారని అంటున్నారు.
హైదరాబాదు సమీపంలోని ఆల్వాల్ మున్సిపల్ పరిధిలోని కనాజిగుడా గ్రామానికి చెందిన 875 ప్లాట్లను రెగ్యులరైజ్ చేసే విషయంలో గ్రీన్ ఫీల్డ్ ఓనర్స్ అసోసియేషన్‌కు చెందిన 75 ఎకరాల భూమిని కబ్జా చేసిందుకు ప్రయత్నించారని కాలనీవాసులు శంకరరావుపై ఫిర్యాదు చేశారు. గ్రీన్‌ఫీల్డ్ ఓనర్స్ అసోసియేషన్ కాలనీవాసులు చేసిన ఫిర్యాదు మేరకుశంకరరావుపై మల్కాజిగిరి పోలీసులు కేసు నమోదు చేశారు
No comments:
Post a Comment
PUBLIC RESPONSE