మాజీ మంత్రి శంకర్రావుకు గ్రీన్ ఫీల్డ్ భూముల వ్యవహారంలో సీఐడీ అధికారులు శనివారం నోటీసులు ఇచ్చారు. ఈ వ్యవహారంలో తమ ఎదుట విచారణకు హాజరుకావాలని శంకర్రావును సీఐడీ అదేశించింది. కాగా, గత నెలలో ఇదే అంశంలో విచారణలో భాగంగా శంకర్రావును బలవంతంగా పోలీసులు అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో అనారోగ్యానికి గురయ్యారు. దాంతో కొంతకాలం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందిన ఆయన్ను ఆస్పత్రి నుంచి మంగళవారంనాడు డిశ్చార్జ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆయన కుమార్తె సుస్మిత శనివారం సీఐడీ అధికారులకు లేఖను అందజేశారు. తన తండ్రి అనారోగ్యంగా ఉన్నందున సిఐడీ అధికారుల మందు విచారణకు హాజరు కాలేకపోతున్నారని ఆమె ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా సుస్మిత మీడియాతో మాట్లాడుతూ మా నాన్న విచారణకు సహకరిస్తారని, ఒక వేళ రాలేని పక్షంలో మా ఇంటికి వచ్చి విచారణ చేసుకోవాలని, అందుకు పూర్తిగా సహకరిస్తామని ఆమె చెప్పారు.

సిఐడి నోటీసు: శంకరన్న గైర్హాజర్, కూతురితో లేఖ
సిఐడి నోటీసు: శంకరన్న గైర్హాజర్, కూతురితో లేఖ
హైదరాబాద్: గ్రీన్‌ఫిల్డ్ భూముల వివాదం కేసులో మాజీ మంత్రి, కాంగ్రెసు శానససభ్యుడు పి. శంకరరావుకు సిఐడి నోటీసులు జారీ చేసింది. ఈ కేసును హైదరాబాదులోని నేరెడ్‌మెట్ పోలీసుల నుంచి సిఐడి తన చేతుల్లోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ రోజు శనివారం తమ ముందు హాజరు కావాలని సిఐడి అధికారులు శంకరరావుకు నోటీసులు జారీ చేశారు. అయితే, శంకర్రావు అనారోగ్యంతో సీఐడీ విచారణకు హాజరుకాలేకపోయారు. తండ్రి తరపున కూతురు సుస్మిత సీఐడీ విచారణకు హాజరయ్యారు. అనారోగ్యం కారణంగా తాను హాజరు కాలేకపోతున్నట్లు ఓ లేఖను శంకరరావు కూతురు ద్వారా సిఐడికి లేఖను పంపించారు. గ్రీన్ ఫీల్డ్ భూముల వ్యవహారంలో శంకరరావును పోలీసులు అదుపులోకి తీసుకున్న తీరుపై గతంలో తీవ్ర వివాదం చెలరేగింది. ఆయనను అదుపులోకి తీసుకున్న తీరును అందరూ ఖండించారు. అయితే, తాము విచారించేందుకే శంకరరావు ఇంటికి వెళ్లామని, స్టేషన్‌కు రమ్మంటే ఆయనే లుంగీ పైన వస్తానని చెప్పారని, తాము ఆయన పట్ల దురుసుగా వ్యవహరించలేదని పోలీసులు చెప్పారు. ఆ తర్వాత శంకరరావు అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. దుమారంపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సిఐడి విచారణకు ఆదేశించారు. అయితే, శంకరరావు ఏ సమయంలో కూడా సిఐడి అధికారులకు సహకరించలేదు. దీంతో కుటుంబ సభ్యులను విచారించి సిఐడి అధికారులు ముఖ్యమంత్రికి నివేదికను సమర్పించారు. ఈ నివేదిక ఆధారంగా ఇద్దరు పోలీసులపై చర్యలు కూడా తీసుకున్నారు. తాజాగా, గ్రీన్‌ఫీల్డ్ వ్యవహారంలో శంకరరావుకు సిఐడి నోటీసులు జారీ చేసింది.
Read more at: http://telugu.oneindia.in/news/2013/03/02/andhrapradesh-cid-issues-notice-shankar-rao-113138.html
Read more at: http://telugu.oneindia.in/
No comments:
Post a Comment
PUBLIC RESPONSE